Home  »  TV News  »  Brahmamudi : అద్దె మొగుడికి ఆఫీస్ ఆఫర్ ఇచ్చిన ఇందు.. షాకింగ్ ట్విస్ట్!

Updated : May 20, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1036 లో.....ఐశ్వర్యని డబ్బులు ఇమ్మని  రాజేష్ అడుగుతుంటే.. అప్పుడే ఇందు వచ్చి ఏంటి గొడవ అని అడుగుతుంది. నా దగ్గర ఐశ్వర్య పది లక్షలు అప్పు తీసుకుందని రాజేష్ చెప్తాడు. దాంతో ఇందు షాక్ అవుతూ అంత డబ్బు ఏం చేసావని అడుగుతుంది ఇందు. నీకు చెప్పాల్సిన అవసరం లేదని కోపంగా లోపలికి వెళ్తుంది ఐశ్చర్య. ఇప్పుడు నాకు డబ్బు ఇవ్వకుంటే ఇచ్చేవరకు గొడవ చేస్తానని రాజేష్ అంటాడు. ఇప్పుడు గొడవ చేస్తే మాకు ప్రాబ్లమ్ అవుతుంది.. ప్లీజ్ దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళండి ఆ డబ్బు ఇప్పించే బాధ్యత నాది అని ఇందు చెప్తుంది. దాంతో రాజేష్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత ఇంట్లో జరుగుతున్న పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని ఇందు ఆఫీస్ కి వెళ్లాలని నిర్ణయం తీసుకుంటుంది. వాళ్ళ నాన్న రాజ్ సూట్ ని తీసుకొని రాజు దగ్గరికి వస్తుంది ఇందు. ఇది మా నాన్న సూట్ ఇది వేసుకొని వెళ్లి ఫైల్ పై సంతకం పెడితే అది సక్సెస్ అయ్యేది అంట అని ఇందు చెప్తుంది. ఇప్పుడు నువ్వు ఇది వేసుకొని ఆఫీస్ కి రావాలని ఇందు చెప్పగానే నేను రాను కేవలం అద్దె మొగుడిగా యాక్టింగ్ చేసినందుకే డబ్బు ఇస్తున్నావ్.. పైగా అందులో కట్టింగ్స్ పోను ఏం ఇవ్వట్లేదని రాజు అంటాడు. నువ్వు ఆఫీస్ కి వచ్చినందుకు దానికి సపరేట్ పేమెంట్ అని ఇందు చెప్తుంది. వెళ్లి సూట్ వేసుకొని రమ్మని ఇందు పంపిస్తుంది.  మరొకవైపు మదన్ దగ్గరికి స్వాతి వచ్చి.. బావ ఈ రోజు నైట్ ప్రోగ్రాం ఉంది.. నువ్వు నాతో రావాలని అంటుంది. నేను రానని మదన్ అంటాడు.

దాంతో తను తింటున్న ఎగ్స్ స్వాతి లాక్కొని ఆటపట్టిస్తుంది. తన వెనకాలే మదన్ పరిగెత్తుతాడు. ఇద్దరు అలా సరదాగా ఉంటుంటే భ్రమరాంబ చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే పై నుంచి రాజు సూట్ వేసుకొని వస్తుంటాడు. రాజుని సూట్ లో చూసిన భ్రమరాంబ షాక్ అవుతుంది. అపర్ణ వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తారు. మేం ఆఫీస్ కి వెళ్తున్నాం అత్తయ్య అని భ్రమరాంబతో రాజు చెప్పగానే అక్షరం ముక్క రానిదాన్ని తీసుకొని వెళ్లి ఏం చేస్తావని భ్రమరాంబ అనగానే తనకి రాకుంటే ఏంటి నాకు చదువు వస్తుంది కదా అని రాజు చెప్తాడు. ఆ తర్వాత ఇద్దరు బయటకు వెళ్తారు. ఆటోలో వెళదామని ఇందు అంటుంటే కార్ లో వెళదామని  భ్రమరాంబని పిలిచి కార్ కావాలి అత్తయ్య అని అడుగుతాడు రాజు. వద్దని భ్రమరాంబ అంటుంది. తన దగ్గరున్నా కీస్ రాజు లాక్కుంటాడు. తరువాయి భాగంలో ఆఫీస్ కి రాజు, ఇందు రావడం చూసి రేఖ షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.